గౌతమ్ గంభీర్ కండీషన్స్ అప్లై
బీసీసీఐ ముందు ప్రతిపాదనలు
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముందు ఎవరైనా తల వంచాల్సిందే. కానీ నిన్నటి దాకా అది జరిగి ఉండవచ్చు. ఇప్పుడు సీన్ మారింది. టీమిండియా ప్రధాన కోచ్ విషయంలో ఇంకా ఎవరనేది ఖరారు కానప్పటికీ ప్రధానంగా ఒకే ఒక్కడి పేరు వినిపిస్తోంది. అదే భారతీయ జనతా పార్టీకి చెందిన , మాజీ క్రికెటర్, కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్.
బీజేపీ పరివారానికి కేరాఫ్ గా మారింది బీసీసీఐ. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తనయుడు జై షా ఇప్పుడు సెక్రటరీగా ఉన్నాడు. అంతా ఆయన కనుసన్నలలోనే నడుస్తోంది. ఇది జగ మెరిగిన వాస్తవం. ఇది పక్కన పెడితే గౌతమ్ గంభీర్ ఎవరి మాట వినడు. తను చెప్పింది మాత్రమే వినాలని అనుకుంటాడు.
అందుకే బీసీసీఐ ముందు తానే కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. వాటికి ఓకే అంటేనే తాను టీమిండియాకు కోచ్ గా ఉంటానని లేదంటే తన పని చేసుకుంటానని సుతిమెత్తగా హెచ్చరించినట్లు టాక్. ఇప్పటికే జట్టుకు సంబంధించి సపోర్ట్ స్టాఫ్ ఉన్నా తనకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ తనకు ఉండాలని కోరారు గౌతమ్ గంభీర్. ఇందుకు బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్టు జాతీయ మీడియా వెల్లడించింది.