రైడర్స్ ను రాటు దేల్చిన గంభీర్
ఫైనల్ గెలుపు వాకిట కేకేఆర్
చెన్నై – ఐపీఎల్ 2024లో అంచనాలకు మించి రాణించింది శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ . ఫైనల్ కు చేరుకుంది. టోర్నీలో ఆది నుంచి ఇప్పటి దాకా ఆ జట్టు అప్రహతిహతంగా గెలుపు సాధిస్తూ వస్తోంది. దీని వెనుక ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడు ఎవరో కాదు ప్రముఖ మాజీ క్రికెటర్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ గా ఉన్న గౌతం గంభీర్.
బౌలింగ్ లో , బ్యాటింగ్ లో , ఫీల్డింగ్ లో ఇలా ప్రతి సందర్బంలోనూ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును నిలిచేలా చేశాడు. విచిత్రం ఏమిటంటే కోల్ కతాకు టోర్నీలో చుక్కలు చూపించింది సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఇక మిగతా జట్ల పరంగా చూస్తే వాటన్నింటిని ఓడించింది కోల్ కతా నైట్ రైడర్స్.
తను ఐపీఎల్ లో ఆడాడు . జట్టును మరింత దుర్భేద్య పూరితంగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాడు గౌతం గంభీర్. ఈ విషయంలో అందరికంటే ముందంజలో ఉన్నాడు. కష్ట కాలంలో జట్టును ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా గెలుపు అంచుల దాకా తీసుకు వెళ్లేలా ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. మొత్తంగా ఆ జట్టుకు బలం..బలగంగా మారడం విశేషం.