అందరినీ అన్ని ఫార్మాట్ లలో ఆడించలేం
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కామెంట్
న్యూఢిల్లీ – టీమిండియా హెడ్ కోచ్ గా నియమితులైన గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా శ్రీలంక పర్యటనకు సంబంధించి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టి20 సీరీస్ కు సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ప్రమోట్ చేసింది. ఇదే సమయంలో వన్డే సీరీస్ కు రోహిత్ శర్మను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశి థరూర్ బీసీసీ సెలెక్షన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను టి20 సీరీస్ కు ఎంపిక చేసి వన్డే సీరీస్ కు ఎంపిక చేయక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు. ఇకనైనా కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని సూచించారు.
ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. బీసీసీఐ పూర్తిగా బీజేపీ ఆఫీస్ గా మారి పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఇదే పార్టీకి చెందిన గంభీర్ కూడా ఇప్పుడు హెడ్ కోచ్ గా ఉండడం విశేషం.
కొందరిని కొన్ని ఫార్మాట్ లకు మాత్రమే తీసుకుంటామని, అందరినీ అన్ని ఫార్మాట్ లకు తీసుకోవడం కుదరదంటూ స్పష్టం చేశారు. ఒక్కో ఆటగాడు ఒక్కో ఫార్మాట్ కు మాత్రమే సరి పోతాడని , ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఆడించాలో కోచ్ కు మాత్రమే ప్లాన్ ఉంటుందన్నారు. బయటి వారికి ఇది అర్థం కాదన్నారు గంభీర్.