ప్రకటించిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
హైదరాబాద్ – భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోంది. ఇప్పటికే 3-0 తేడాతో సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు టి20 సీరీస్ కైవసం చేసుకుంది.
ఎవరూ ఊహించని రీతిలో గంభీర్ వచ్చాక పెను మార్పులు తీసుకు వచ్చాడు. రింకూ సింగ్ , రియాన్ పరాగ్ , సూర్య కుమార్ యాదవ్ లను ఆల్ రౌండర్లుగా మార్చేశాడు. ఈ సందర్బంగా సీరీస్ గెలిచాక గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడారు.
భారత జట్టుకు సంబంధించి త్వరలో పెను మార్పులు చేయక తప్పడం లేదన్నారు. జట్టు పరంగా గతంలో ఉన్న సంప్రదాయ పద్ధతులను తాను పాటించ బోనంటూ కుండ బద్దలు కొట్టాడు. అంతే కాదు జట్టులో ఏడుగురు క్రికెటర్లను ఆల్ రౌండర్లుగా మార్చుతానని ప్రకటించాడు గౌతమ్ గంభీర్.
ఇక నుంచి క్రికెటర్లు ఒకే ఒక్క ఫార్మాట్ కు పరిమితం కాకూడదని చెప్పకనే చెప్పాడు టీమిండియా హెడ్ కోచ్. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఇండియా జట్టు స్వరూపం పూర్తిగా మారనుందని ఆశిద్దాం.