జీసీహెచ్ఎస్ఎల్ ఫలితాలు విడుదల
గోపరాజు ప్యానెల్ ఘన విజయం
హైదరాబాద్ – హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో గోపరాజు ప్యానల్ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గోపరాజు, ఎం. రవీంద్రబాబు, వెంకటాచారి, కమలాచార్య, ఎం.ఎస్.కె. హష్మి, భీమగాని మహేశ్వర్ గౌడ్, మసాడే లక్ష్మీ నారాయణ, భాగ్యలక్ష్మి, స్వేచ్ఛ గెలుపొందారు.
మొత్తం ఈసారి పోటీ రసవత్తరంగా సాగింది. మొత్తం మూడు ప్యానల్స్ రంగంలోకి దిగాయి. వెంకటాచారి, హష్మి , స్వేచ్ఛ ప్యానల్ కాగా మరొకటి గోపరాజు, లక్ష్మీ నారాయణ పోటీలో నిలిచింది. వీరితో పాటు వీరాంజనేయులు, జమున ప్యానల్ తొలిసారిగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో బరిలోకి దిగింది.
మొత్తం 2200 సభ్యులు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో ఇళ్ల స్థలాలు పొందిన వారు పోగా మిగతా 2000 మంది నాన్ అలాటీస్ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా తమకు ఇళ్ల స్థలాలు కావాలని గత 20 ఏళ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే సంస్థకు చెందిన స్థలం ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. విచారణకు ఆదేశించింది. మొత్తం మీద టీ న్యూస్ ఛానల్ సీఈవోగా ఉన్న శైలేష్ రెడ్డి వెనుక ఉండి చక్రం తిప్పారు. తను అనుకున్నది సాధించారు.