NEWSNATIONAL

దారుల‌న్నీ ఇట‌లీ వైపు

Share it with your family & friends

దేశాధినేత‌లు క్యూ

ఇట‌లీ – యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు ఇట‌లీ వైపు చూస్తోంది. నిన్న‌టి దాకా భార‌త్ వైపు చూసిన దేశాధినేత‌లు ఇప్పుడు ఇటలీ బాట ప‌ట్టారు. దీనికి ప్ర‌త్యేక కార‌ణం ఉంది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జి7 స‌ద‌స్సుకు వేదిక‌గా నిలిచింది ఇటలీ.

దీనికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు ఆ దేశ అధ్య‌క్షురాలు జార్జియో మెలోనీ. ఆమెనే ద‌గ్గ‌రుండి అంద‌రినీ చూసుకుంటున్నారు. త‌నే స్వ‌యంగా సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఇప్ప‌టికే అతిర‌థ మ‌హార‌థులు చేరుకున్నారు.

నిన్న యుకె ప్ర‌ధాన మంత్రి రిషి సున‌క్ హాజ‌రు కాగా శుక్ర‌వారం భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ చేరుకున్నారు. ఆయ‌న‌కు గ్రాండ్ వెల్ క‌మ్ ల‌భించింది. ప్ర‌స్తుతం జి7 స‌ద‌స్సు ఇట‌లీ లోని పుగ్లియాలో జ‌రుగుతోంది. ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది ఇట‌లీ ప్ర‌భుత్వం.

ఈ శిఖ‌రాగ్ర స‌మావేశంలో ప్ర‌పంచాన్ని ఇబ్బంది క‌లిగిస్తున్న ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం, ఉగ్ర‌వాదం, ఆర్థిక సంక్షోభం, త‌దిత‌ర అంశాలు చ‌ర్చ‌కు రానున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు ఆ దేశ‌పు ప్రెసిడెంట్ జార్జియా మెలోనీ.