NEWSINTERNATIONAL

ఔనా ఆయ‌న‌తో డేటింగ్ నిజ‌మేనా

Share it with your family & friends

ఇట‌లీ ప్ర‌ధాని జార్జియా మెలోనీ కామెంట్

ఇట‌లీ – దేశ ప్ర‌ధాన మంత్రి జార్జియా మెలోనీ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక్క‌సారిగా హాట్ టాపిక్ గా మారి పోయారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటంటే టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ సీఈవో ఎలోన్ మ‌స్క్ ఆమె గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

జార్జియా మెలోనీ అమెరికాలో జ‌రిగిన ఓ అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మానికి విశిష్ట అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఎలోన్ మ‌స్క్ కూడా పాల్గొన్నారు. ఆమెతో చాలా సేపు భేటీ అయ్యారు. ఇద్ద‌రూ ఫోటోలు కూడా దిగారు. దీంతో ఇద్ద‌రూ కొంత కాలం నుంచీ డేటింగ్ లో ఉన్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా జ‌రిగింది.

దీనిపై ఎలోన్ మ‌స్క్ స్పందించారు. బుధ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమెతో స‌న్నిహితంగా ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని, కానీ డేటింగ్ లో మాత్రం లేన‌ని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై ఇటలీ ప్ర‌ధాన‌మంత్రి జార్జియా మెలోనీ స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప్రపంచ మీడియా ప్రకారం తాను ఎలోన్ మస్క్‌తో డేటింగ్ చేస్తున్నానని, కానీ అలాంటిది ఏమీ లేద‌ని పేర్కొన్నారు.