తేడా వస్తే తెలంగాణ తెగిస్తుంది
సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోండి
హైదరాబాద్ – మాజీ టీఎస్పీపీస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తెలంగాణ రాజ్ భవన్ కు రాబోతున్న సీఎం చంద్రబాబు కు స్వాగతం చెబుతూనే పలు సూచనలు చేశారు ఘంటా చక్రపాణి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు తెలంగాణా ఆకాంక్షలు తెలుసని అనుకుంటుంటున్నానని పేర్కొన్నారు.
తెలంగాణా విభజన సమయంలో మీరు నన్ను ఆహ్వానించినప్పుడు నేను అన్ని విషయాలు మీకు వివరించానని గుర్తు చేశారు. మీరు కూడా పెద్దమనసుతో విన్నారు. అంగీకరించారని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు ఆమోదించారని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలం అన్నదమ్ముల్లా విడిపోయాం. ఆత్మీయుల్లా కలిసే ఉంటున్నామని పేర్కొన్నారు.
.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు కాకుండా పాండవుల మాదిరి మావాళ్లు ఐదు గ్రామాలనే అడుగుతున్నారని, ఇచ్చేయాలని కోరారు . విభజన చట్టానికి అనుగుణంగా ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించాలని సూచించారు.
. 9, 10 షెడ్యూలులో ఉన్న అన్ని సంస్థలను, అందులోని ఉద్యోగులను, వనరులను చట్టం ప్రకారం తీసుకు వెళ్లాలని కోరారు ఘంటా చక్రపాణి..మీరు, మీ వాళ్లు హైదరాబాద్ లో ఉంటారు. ఉండండి. మేం అప్పుడప్పుడు ఆంధ్రాకు చుట్టపు చూపుగానో, పర్యాటకులుగానో వస్తామన్నారు.
రెండు రాష్ట్రాలు ఒకటే అని భావిస్తూనే రాష్ట్రాల కు చట్ట పరంగా రావాల్సిన వాటాల విషయంలో రాజీ పడకుండా పంచుకుందామని స్పష్టం చేశారు. మరో వైపు తేడా వస్తే మాత్రం తెలంగాణ సమాజం కొట్లాడేందుకు సిద్దంగా ఉందని హెచ్చరించారు.