NEWSINTERNATIONAL

గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కాల్చివేత‌

Share it with your family & friends

సిద్దూ మూసేవాలా మ‌ర్డ‌ర్ సూత్ర‌ధారి

అమెరికా- ప్ర‌ముఖ గ్యాంగ్ స్ట‌ర్ గోల్డీ బ్రార్ ను అమెరికాలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపారు. ప్ర‌ముఖ పేరు పొందిన పంజాబీ గాయ‌కుడు, కాంగ్రెస్ నేత సిద్దూ మూసే వాలా మ‌ర్డ‌ర్ కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారిగా ఉన్నాడు గోల్డీ బ్రార్. త‌న‌తో పాటు ఉన్న మ‌రొక‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు స‌మాచారం. గోల్డీ బ్రార్ ప్ర‌త్య‌ర్థులు అర్ష్ ద‌ల్లా, ల‌క్బీర్ దాడికి బాధ్య‌త వ‌హించిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.

మూసే వాలా మ‌ర్డ‌ర్ కేసులో కీల‌క‌మైన సూత్ర‌ధారిగా ఉన్నాడు గోల్డీ బ్రార్. కేసు న‌మోదు చేసిన వెంట‌నే త‌ను ఖాకీల క‌న్ను గ‌ప్పి కెన‌డా పారి పోయిన‌ట్లు భార‌త పోలీసులు గుర్తించారు. కెన‌డాలో మోస్ట్ వాంటెడ్ 25 మంది టెర్ర‌రిస్టుల‌లో గోల్డీ బ్రార్ కూడా ఒక‌డు.

ఇదిలా ఉండ‌గా గోల్డీ బ్రార్ తన నివాసం వెలుపల సహచరుడితో కలిసి వీధిలో నిలబడి ఉండగా, గుర్తు తెలియని దుండగులు అక్కడికి వచ్చి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తరలించగా, ఒకరు తీవ్రంగా గాయపడి మరణించారు.

ఎవ‌రీ గోల్డీ బ్రార్…?
పారిపోయిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ అసలు పేరు సతీందర్‌జీత్ సింగ్. అతను పంజాబ్ మాజీ పోలీసు అధికారి కుమారుడు. మొదట్లో పంజాబ్‌లోని స్థానిక ముఠా పోటీలలో పాల్గొన్న అతను త్వరగా మరింత తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. పంజాబ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు.