53 బంతుల్లో స్కాట్లాండ్ పై సూపర్ సెంచరీ
ముంబై – మహిళా క్రికెట్ లో వరల్డ్ రికార్డ్ సృష్టించింది తెలంగాణకు చెందిన బిడ్డ గొంగడి త్రిష. మహిళల 19 ప్రపంచక ప్ లో భాగంగా కౌలాలంపూర్ లో స్కాట్లాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. కేవలం 53 బంతులు ఎదుర్కొని సూపర్ సెంచరీ చేసింది. అండర్ 19 టీ20 ఫార్మాట్ లోసెంచరీ చేసిన తొలి మహిళా బ్యాటర్ గా త్రిష చరిత్ర సృష్టించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 208 రన్స్ చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు బిగ్ స్కోర్ సాధించింది. ఓపెనర్ కమిలిని హాఫ్ సెంచరీతో దుమ్ము రేపింది. సానికా చల్కే 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.
మరో వైపు మైదానంలోకి వచ్చీ రావడంతోనే పరుగుల మోత మోగించింది క్రికెటర్ గొంగిడి త్రిష. 53 బంతులు ఎదుర్కొన్న త్రిష 12 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో విరుచుకు పడింది. మొత్తం 110 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ప్రపంచ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీసీసీఐ కార్యదర్శి జే షా అభినందనలు తెలిపారు.