స్పష్టం చేసిన తెలంగాణ క్రికెటర్ త్రిష
హైదరాబాద్ – అందరం కలిసికట్టుగా ఆడామని అందుకే అండర్ 19 మహిళల వరల్డ్ కప్ గెలిచామని అన్నారు తెలంగాణకు చెందిన క్రికెటర్ గొంగిడి త్రిష. మలేషియా నుంచి హైదరాబాద్ కు విచ్చేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి సీనియర్ టీమ్ లో చోటు దక్కించు కోవడంపై ఫోకస్ పెడతానని అన్నారు. ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాలని కసితో ఆడామన్నారు. ఈసారి ధృతికి ఛాన్స్ రాలేదని వాపోయింది. నా సక్సెస్ వెనుక మా నాన్న ఉన్నాడని చెప్పారు.
ఇదిలా ఉండగా అండర్ 19 వరల్డ్ కప్ మలేషియాలో జరిగింది. భారత జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. ఈ టోర్నీలో అద్భుతమైన ప్రతిభను కనబర్చింది క్రికెటర్ గొంగిడి త్రిష. తను టి20 ఫార్మాట్ లో సెంచరీ సాధించి రికార్డ్ సృష్టించింది. అంతే కాదు ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జట్టును కేవలం 82 పరుగులకే కట్టడి చేసింది. కీలకమైన బ్యాటర్లను పెవిలియన్ కు పంపించింది. 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసింది.
అంతే కాకుండా బ్యాటింగ్ లో దుమ్ము రేపింది. 44 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచింది. టీమిండియాకు ఘనమైన విజయాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించింది గొంగిడి త్రిష.