Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHవిశాఖ‌లో గూగుల్ ఐటీ సిటీ ఏర్పాటు

విశాఖ‌లో గూగుల్ ఐటీ సిటీ ఏర్పాటు

ఏపీ ప్ర‌భుత్వంతో కీల‌క ఒప్పందం

అమ‌రావ‌తి – ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జ సంస్థ గూగుల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దావోస్ వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సులో ఏపీ ప్ర‌భుత్వంతో కీల‌క ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా విశాఖప‌ట్నంలో గూగుల్ ఐటీ సిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల వేలాది మంది ప్ర‌తిభ‌, నైపుణ్యం క‌లిగిన యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని తెలిపింది. ఒప్పందంలో భాగంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ , ప్ర‌భుత్వం త‌ర‌పున లోకేష్ సంత‌కాలు చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించేందకు ఏపీతో ఒప్పందం చేసుకుంది గూగుల్ క్లౌడ్. టెమా సెక్ స్ట్రాటజిక్ హెడ్ రవి లాంబాతో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటి అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖ పట్నం, తిరుపతి నగరాల్లో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయాలని, టెమాసెక్ అనుబంధ సంస్థ సెంబ్ కార్స్ తో కలిసి పునరుత్పాదక విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విన్న‌వించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments