BUSINESSTECHNOLOGY

డొనాల్డ్ ట్రంప్ కు స‌హ‌క‌రిస్తాం – సుంద‌ర్ పిచాయ్

Share it with your family & friends

ప్రెసిడెంట్ గా గెలిచినందుకు కంగ్రాట్స్

అమెరికా – ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి సుంద‌ర్ పిచాయ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమెరికాలో తాజాగా జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ త‌న పొలిటిక‌ల్ కెరీర్ లో ఊహించ‌ని రీతిలో రికార్డ్ సృష్టించారు. ఆయ‌న ఘ‌న విజ‌యం సాధించారు. రెండోసారి అధ్య‌క్ష ప‌ద‌విలో కొలువు తీర‌నున్నారు.

గెలుపొందిన సంద‌ర్భంగా ట్రంప్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ రంగాల‌కు చెందిన వారి నుంచి , దేశాధినేత‌లు, ప్ర‌ధానమంత్రులు, టెక్ దిగ్గ‌జాలు పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా గూగుల్ సీఈవో ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు ట్రంప్ కు.

ఆయ‌న విజ‌యాన్ని “అమెరికన్ ఆవిష్కరణల స్వర్ణ యుగం”గా అభివర్ణించారు. గురువారం ఎక్స్ వేదిక‌గా స్పందించిన సుంద‌ర్ పిచాయ్ చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

ట్రంప్ పరిపాలనలో సాంకేతికత భవిష్యత్తు గురించి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు, సాంకేతిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త నాయకత్వంతో సహకరించడానికి గూగుల్ సిద్దంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు సుంద‌ర్ పిచాయ్.