BUSINESSTECHNOLOGY

గొప్ప స్నేహితురాలిని కోల్పోయా

Share it with your family & friends

గూగుల్ సిఈవో సుంద‌ర్ పిచాయ్

అమెరికా – గూగుల్ కు చెందిన సంస్థ యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కీకీ క‌న్ను మూశారు. ఆమె వ‌య‌సు 56 ఏళ్లు. త‌ను కొంత కాలం నుంచి క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు. ఎంతో ఇబ్బందులు ప‌డ్డారు. యూట్యూబ్ ను కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు చేర వేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఎన్నో మార్పులు తీసుకు వ‌చ్చారు.

ఆమె మ‌ర‌ణ వార్త తెలిసిన వెంట‌నే స్పందించారు గూగుల్ సిఇఓ సుంద‌ర్ పిచాయ్. సుదీర్గ కాలం పాటు గూగుల్ కు చెందిన యూట్యూబ్ లో సేవ‌లు అందించార‌ని గుర్తు చేశారు. సిఈవోగా చాలా ప్ర‌యోగాలు చేశార‌ని, యూట్యూబ్ ను ప్ర‌పంచ వ్యాప్తంగా టాప్ లో నిలిచేందుకు ఎందో కృషి చేశార‌ని కొనియాడారు.

సుసాన్ లేరన్న వార్త త‌న‌ను క‌లిచి వేసింద‌ని పేర్కొన్నారు సుంద‌ర్ పిచాయ్. సాంకేతిక నైపుణ్యం క‌లిగిన గొప్ప వ్య‌క్తి..అంతే కాదు త‌న‌కు మంచి స్నేహితుల‌లో ఆమె కూడా ఒక‌రు అని తెలిపారు . త‌ను మంచి , స‌హృద‌యం క‌లిగిన స్నేహితురాలిని కోల్పోయాన‌ని, ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని పేర్కొన్నారు గూగుల్ సిఈవో.

త‌న‌తో పాటు గూగుల్ సంస్థ‌లోని ప్ర‌తి ఒక్క‌రు సుసాన్ కు నివాళులు అర్పిస్తున్న‌ట్లు తెలిపారు.