రోగాలను గుర్తించేందుకు గూగుల్ ఏఐ
అభివృద్ది చేస్తున్నట్లు జోరుగా ప్రచారం
అమెరికా – ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం టెక్నాలజీలో సంచలనం సృష్టిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) . ఇప్పటికే దీని ద్వారా చాలా పనులు తేలికగా అవుతున్నాయి. తక్కువ ఖర్చు ఎక్కువ సదుపాయాలు పొందేలా ఉండడంతో ప్రతి ఒక్కరు ఏఐ జపం చేస్తున్నారు.
ఇప్పటికే జెమిని పేరుతో ప్రత్యేకంగా ఏఐ టూల్ ను డెవలప్ చేసింది గూగుల్. తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఎలాంటి భాషనైనా మార్చుకునే వీలు కల్పించింది. మరో కీలక మార్పునకు తెర తీసింది గూగుల్.
కేవలం వినడం ద్వారా రోగాలను గుర్తించేందుకు గూగుల్ ఏఐని అభివృద్ది చేసే పనిలో పడిందని సమాచారం. దగ్గు , తుమ్ము వంటి శబ్దాలను విశ్లేషించడం ద్వారా క్షయ వ్యాధి వంటి వ్యాధులను గుర్తించగల AI మోడల్ ను డెవలప్ చేసినట్లు టాక్.
300 మిలియన్ ఆడియో శాంపిల్స్‌పై శిక్షణ పొందిన ఈ సాంకేతికత ఆరోగ్య సంరక్షణ విశ్లేషణలను మార్చగలదు, ముఖ్యంగా అధునాతన వైద్య సాధనాలు లేని ప్రాంతాల్లో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ పేర్కొంటోంది.
Salcit Technologies సహకారంతో, Google స్మార్ట్‌ఫోన్ మైక్రోఫోన్‌ల ద్వారా శ్వా సకోశ వ్యాధులను ముందస్తుగా గుర్తించడాన్ని మెరుగు పరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.