గూగుల్ లో లే ఆఫ్స్ ఉద్యోగులకు షాక్
కీలక ప్రకటన చేసిన సుందర్ పిచాయ్
అమెరికా – టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ బిగ్ షాక్ ఇచ్చింది. కొత్త ఏడాదికి ముందే కోలుకోలేని రీతిలో చావు కబురు చెప్పారు సీఈవో సుందర్ పిచాయ్. తమ సంస్థలో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో వివిధ కేటగిరీలలో పని చేస్తున్న వారు ఉన్నారని తెలిపారు.
రోజు రోజుకు పెరుగుతున్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పోటీ మధ్య మేనేజర్ వర్క్ ఫోర్స్ ను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారని చెప్పారు. భారీ కోత విధించడంతో ఇప్పటికే గూగుల్ ను నమ్ముకుని పని చేస్తున్న వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఇదిలా ఉండగా అమెరికా లోని కాలిఫోర్నియా మౌంటెన్ వ్యూలో గూగుల్ ఐఓ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సుందర్ పిచాయ్ మాట్లాడారు. 2022లో 12,000 మందిని తొలగించడం జరిగిందన్నారు. ప్రస్తుతం వర్క్ ఫోర్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు. ఇందులో భాగంగా కొంత మందిని తొలగించక తప్పడం లేదని స్పష్టం చేశారు సిఈవో. ఇదే సమయంలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు గూగుల్ ను అప్ డేట్ చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు.