హైద్రాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్
సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ ప్రతినిధి
హైదరాబాద్ – ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అత్యంత ముఖ్యమైన సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో గూగుల్ ప్రతినిధి స్పష్టం చేశారు.
గూగుల్ తో ప్రధాన అత్యాధునిక సాంకేతిక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ముగించడం జరిగిందని తెలిపారు సీఎం ఎ . రేవంత్ రెడ్డి.
గూగుల్ తన సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ని స్థాపించడానికి హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఇది ఆసియా పసిఫిక్‌లో రెండవది. అంతే కాదు గూగుల్ సంస్థకు సంబంధించి ప్రపంచంలో ఐదవది మాత్రమే.
గూగుల్ సీఐఓ రాయల్ హాన్సెన్, గ్లోబల్ టెక్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ సర్కార్ , గూగుల్ ఇండియా ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని గూగుల్ గ్లోబల్ టీమ్ సీఎంతో భేటీ అయ్యింది.
వీరితో పాటు గూగుల్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ హెడ్, సీనియర్ డైరెక్టర్ మంగళ శేషాద్రి, గూగుల్ స్టార్టప్ హెడ్ అపూర్వ చమారియా కూడా ఉన్నారు. హైదరాబాద్‌ను సేఫ్టీ ఇంజనీరింగ్ , సైబర్ సెక్యూరిటీకి గ్లోబల్ హబ్‌గా మార్చడానికి పునాదిని ఏర్పాటు చేశామన్నారు.
గూగుల్ సంస్థ ఏర్పాటు చేయడం వల్ల మన యువతకు వేలాదిగా ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.