ఏపీతో గూగుల్ కీలక ఒప్పందం
ఐటీ..ఏఐ హబ్ గా మార్చేస్తాం
అమరావతి – ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్ కీలక ఒప్పందం చేసుకుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో. ఏపీని ఐటీ హబ్ తో పాటు విశాఖను ఏఐకి కేరాఫ్ గా మార్చాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు ఈ సందర్బంగా ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఇదే సమయంలో గూగుల్ ఏపీకి రావడానికి ప్రధాన కారకుకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అంటూ కితాబు ఇచ్చారు. గూగుల్ గ్లోబల్ నెట్ వర్కింగ్ , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే నేతృత్వంలోని గూగుల్ బృందానికి స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
ఏఐ ( AI ) కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ . గూగుల్ ప్రతినిధి బృందం భారతదేశ కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం ప్రధానంగా చర్చించారు. బికాష్ కోలే కీలక భాగస్వామ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
యువ ప్రతిభకు అర్ధవంతమైన ఉపాధి అవకాశాలను సృష్టించే అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థను స్థాపించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తును రూపొందించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందని స్పష్టం చేశారు గూగుల్ ప్రతినిధి.