గూగుల్ టెక్కీ అను శర్మ వైరల్
మోస్ట్ పాపులర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్
హైదరాబాద్ – ఎవరీ అనుశర్మ అనుకుంటున్నారా. మోస్ట్ పాపులర్ టెక్కీగా గుర్తింపు పొందింది. తను నేర్చుకున్న ప్రతి దాని గురించి ఇతరులతో పంచుకుంటోంది. అంతే కాదు ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే స్పందిస్తుంది. ఉచితంగానే అన్నింటిని అందజేస్తోంది. నాలెడ్జ్ ఉండడం వేరు. దానిని పది మందికి పంచడం వేరు. ఎంతగా మనం ఇవ్వ గలిగితే అంతగా మనం తీసుకోగలం..నేర్చుకోగలం అంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది అను శర్మ. ప్రస్తుతం గూగుల్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది.
సబ్జెక్టును పెంచుకునే ప్రయత్నం చేస్తే జాబ్స్ అవంతట అవే వస్తాయని అంటోంది. కానీ చాలా మంది కోర్సులు చేస్తారు..నేర్చుకోవాలనే ప్రయత్నం చేయక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారంటూ పేర్కొంది. ఈ అమ్మడు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఏ అంశం గురించి అడిగినా సరే ఠకీమని క్షణాల్లో మనకు చెప్పేస్తోంది. ఒక రకంగా కంప్యూటర్ కు మించిన స్పీడ్. నేర్చు కోవాలన్న తపన తనను ఇలా చేసిందని చెప్పక తప్పదు.
మిగతా కంపెనీలకు టెక్ దిగ్గజం గూగుల్ కు చాలా తేడా ఉందంటోంది అను శర్మ. తన కెరీర్ లో తనకు ఎదురైన అనుభవాలను ఇటీవల పంచుకుంది. దీంతో నిమిషాల్లోనే వరల్డ్ వైడ్ గా వైరల్ గా మారి పోయింది. ట్విట్టర్ వేదికగా ఓ స్టార్టప్ సంస్థ తన లేఖను ఎలా తిరస్కరించిందనే విషయాన్ని సామాజిక మాధ్యమంగా పంచుకుంది. ఆ తిరస్కరణను కూడా తాను లైట్ గా , పాజిటివ్ గా తీసుకున్నానని స్పష్టం చేసింది అను శర్మ.
తను చేసిన పోస్ట్ లో కీలక వ్యాఖ్యలు చేసింది. తన లేఖను తిరస్కరించిన వారిపై ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదు. చాలా థ్యాంక్స్ అంటూ పేర్కొంది. అయితే మీ అర్హత, అనుభవం తాము కోరిన పోస్ట్ కంటే ఎక్కువగా ఉన్నాయని. మిమ్మల్ని గనుక తీసుకుంటే మీరు అనుకున్న దాని కంటే ముందే వెళ్లి పోతారేమోనని..తిరస్కరిస్తున్నట్లు స్టార్ట్ అప్ కంపెనీ తెలిపింది. అయితే ఒక్కోసారి ఎక్కువ అర్హతలు, అనుభవం కలిగి ఉండడం కూడా ఇబ్బంది కరంగా మారడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది అను శర్మ.
ఇదిలా ఉండగా అను శర్మ గతంలో ఇన్ టు ఇట్, ట్విట్టర్ , లింక్డ్ ఇన్ , ఉబేర్, అగోడా, డీఈ షా అండ్ కో, అట్టాసియన్ , బ్లూమ్ బెర్గ్ , పలంటీర్ , ప్లిఫ్ కార్ట్, సర్వీస్ నౌ, స్ట్రైప్ తో పాటు గూగుల్ లో సెలెక్ట్ అయ్యింది. ఎక్స్ లో కొంత కాలం పని చేశాక..ప్రస్తుతం గూగుల్ లో పూర్తి కాలం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది తను. ఏది ఏమైనా నిరుత్సాహ పడకుండా నేర్చుకుంటూనే ఉండండి..ప్రపంచంతో పోటీ పడండి..ఎక్కడా తల వంచకండి. మన ప్రతిభను గుర్తించే వాళ్లు, సంస్థలు, కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు పిలుపు రాకుండా ఉండదని అంటోంది అను శర్మ.