గూగుల్ విల్లో కంప్యూటింగ్ చిప్ రిలీజ్
విడుదల చేసిన సీఈవో సుందర్ పిచయ్
అమెరికా – ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన ప్రకటన చేసింది. చిప్ టెక్నాలజీలో వినూత్నమైన , అత్యాధునిక మార్పులతో విల్ పేరుతో క్వాంటమ్ చిప్ ను విడుదల చేశారు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్.
ఇది ఒక సూపర్ కంప్యూటర్ పూర్తి చేసేందుకు 10 సెప్టిలియన్ సంవత్సరాలు పట్టే పనిని కేవలం 5 నిమిషాలలో చేయగలదని ప్రకటించారు. ఈ చిప్ టెక్నాలజీ రంగంలో పెను విప్లవంగా పేర్కొనవచ్చు. ఇప్పటికే చిప్ తయారీపై ఫోకస్ పెట్టిన టెస్లా చైర్మన్ , ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్ అని చెప్పక తప్పదు.
టెక్నాలజీ ఉపయోగంలో చిప్ వాడకం కీలకం. డేటాను నిక్షిప్తం చేసేందుకు ఇది దోహద పడుతుంది.
మరింత శక్తివంతమైన పనితీరుతో పాటు, పరిశోధకులు లోపాలను తగ్గించడానికి కూడా ఒక మార్గాన్ని కనుగొన్నారు, దీనిని Google “క్వాంటం కంప్యూటింగ్‌లో అతిపెద్ద సవాళ్లలో ఒకటి” అని పేర్కొన్నారు సీఈవో .
“ఈ చారిత్రాత్మక సాఫల్యాన్ని ఫీల్డ్‌లో ‘బిలో థ్రెషోల్డ్’ అని పిలుస్తారు – క్విట్‌ల సంఖ్యను పెంచేటప్పుడు లోపాలను తగ్గించగలగడం” అని గూగుల్ క్వాంటం ఏఐ వ్యవస్థాపకుడు హార్ట్‌మట్ నెవెన్ గూగుల్ బ్లాగ్‌లో రాశారు.