జీసీహెచ్ఎస్ఎల్ ప్రెసిడెంట్ గా గోపరాజు
ఏకగ్రీవంగా ఎన్నికైన ఇతర కార్యవర్గం
హైదరాబాద్ – ది జర్నలిస్ట్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కు జరిగిన ఎన్నికల్లో నాన్ అలాటీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. మొత్తం 9 డైరెక్టర్స్ పోస్టులకు గాను నాన్ అలాటీ ప్యానెల్ నుంచి 8 మంది పోటీ చేయగా 6 గురు అభ్యర్థులు డైరెక్టర్ లు విజయం సాధించారు.
గురువారం జరిగిన కమిటీ సమావేశంలో అధ్యక్షులు గా బ్రహ్మండ భేరి గోపరాజు ని ఎన్నుకున్నారు. కార్యదర్శి గా ఎం.రవీంద్రబాబు, కోశాధికారిగా భీమగాని మహేశ్వర్ గౌడ్ , ఉపాధ్యక్షులుగా ఎం.లక్ష్మీ నారాయణ, సహాయ కార్యదర్శిగా సి.హెచ్.భాగ్యలక్ష్మి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికైన సొసైటీ నూతన అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు మాట్లాడారు. నాన్ అలాటీ సభ్యులకు ఇండ్ల స్థలాలు ఇప్పించడమే తమ మొదటి లక్ష్యమని పేర్కొన్నారు. సొసైటీ లోని అలాటీ సభ్యులను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.
సొసైటీ పరిధిలోని కాలనీల అభివృద్ధికీ, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. ఎన్నికైన సభ్యులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేందర్ రెడ్డి దృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు డి.కమలాచార్య, తదితరులు పాల్గొన్నారు.