ఏపీలో గోరంట్ల తొలి విజయం
టీడీపీ కూటమికి భారీ గెలుపు
అమరావతి – ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి తొలి ఫలితం వెల్లడైంది. మంగళవారం తొలి గెలుపును రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ గెలుపును సాధించింది ఎవరో కాదు కూటమికి చెందిన టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆయన ఇప్పటి వరకు అత్యంత సీనియర్ నాయకుడుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుసార్లు గెలుపొందారు.
ఇది కూడా ఓ రికార్డ్ కావడం విశేషం. ఇదిలా ఉండగా మంగళవారం ప్రకటించిన ఈ గెలుపుతో ఒక్కసారిగా కూటమి శ్రేణుల్లో సంబురాలు అంబరాన్ని అంటాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి 63 వేలకు పైగా భారీ మెజారిటీని సాధించారు.
వైసీపీ అభ్యర్థిపై ఆయన గెలుపొందడం విశేషం. ఇక 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూస్తే ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీడీపీ 130 స్థానాలలో లీడింగ్ లో ఉండగా జనసేన 19 స్థానాల్లో , బీజేపీ 6 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ పూర్తి గెలుపు దిశగా ఉండడం విశేషం.