టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి
అమరావతి – టీడీపీ సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీకి నేతలు లేరన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాక ఆ పార్టీకి గుర్తింపు లభించిందన్నారు. తమ పార్టీకి చెందిన కొందరు ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారని తెలిపారు.
పవన్ కళ్యాన్ పార్టీకి నేతలే కాదు కార్యకర్తలు కూడా లేరన్నారు. టీడీపీతో పొత్తు ఉంది కాబట్టే వారు ఎగిరెగిరి పడుతున్నారంటూ సెటైర్ వేశారు. భారతీయ జనతా పార్టీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు.
కాషాయ పార్టీతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా పిలిస్తేనే టీడీపీ బాస్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వెళ్లి కలిశారని అన్నారు. కర్ణాటక ప్రజలు కూడా బీజేపీని తిరస్కరించారని , ఆ పార్టీకి దక్షిణాది భారతంలో పట్టు లేదని స్పష్టం చేశారు.