NEWSANDHRA PRADESH

రాజ‌మండ్రి రూర‌ల్ మ‌న‌దే

Share it with your family & friends

గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

అమ‌రావ‌తి – టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కొంద‌రు కావాల‌ని జ‌న‌సేన పార్టీకి సీటు కేటాయించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగ‌తోంద‌న్నారు. దీనిని తాము తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

కొంద‌రు కావాల‌ని టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య విభేదాలు సృష్టించాల‌ని చూస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిని తాము ప‌ట్టించు కోవ‌డం లేద‌న్నారు బుచ్చ‌య్య చౌద‌రి. టీడీపీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భావోద్వేగాల‌కు లోను కావ‌ద్ద‌ని సూచించారు.

ఆరు నూరైనా స‌రే రాజ‌మండ్రి రూర‌ల్ టికెట్ తెలుగుదేశం పార్టీకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు బుచ్చ‌య్య చౌద‌రి. చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు గోరంట్ల పోటీలో ఉండ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. దీనికి సంబంధించి పార్టీ బాస్ సంత‌కం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని పేర్కొన్నారు.