Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHస‌భ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించండి

స‌భ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించండి

ఇలా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం త‌గ‌దు

అమ‌రావ‌తి – స‌భ స‌జావుగా జ‌రిగేందుకు వైసీపీ స‌భ్యులు స‌హ‌క‌రించాల‌ని కోరారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. ఇలా అడ్డుకుంటే విలువైన స‌మ‌యం పాడ‌వుతంద‌ని అన్నారు. ఛైర్మన్ పోడియం వద్ద వైసీపీ నేతలు అల్లరి చేయడం మంచి పద్దతి కాదన్నారు.

ప్ర‌జా ధ‌నం ఖ‌ర్చ‌వుతోంద‌న్న విష‌యం గుర్తు పెట్టుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు గొట్టిపాటి ర‌వికుమార్. ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు హుందాగా మెల‌గాల‌ని, ప‌ది మందికి ఆద‌ర్శ ప్రాయంగా ఉండాల‌ని సూచించారు మంత్రి. ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తూ, స‌భ‌కు ఆటంకం క‌లిగిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

సోషల్ మీడియా సైకోలకు పెద్దల సభలో వైసిపి సభ్యుల మద్దతు ఇవ్వ‌డం సిగ్గు చేటు అన్నారు గొట్టిపాటి ర‌వికుమార్.

చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అవమానిస్తుంటే.. అప్పటి సభలో సీఎం హోదాలో ఉన్న జగన్, మిగిలిన వైసీపీ సభ్యులు వెకిలి నవ్వులు నవ్వారని మండిప‌డ్డారు.

డీసీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత కుటుంబ సభ్యులతో పాటు జగన్ చెల్లిని కూడా సభ్య సమాజం తల దించుకునేలా సోషల్ మీడియా లో కామెంట్స్ చేశార‌ని, పోస్టులు పెట్టారంటూ ఆరోపించారు.

సోషల్ మీడియా సైకోలకు మద్దతుగా… పెద్దల సభకు వచ్చిన వైసిపి సభ్యులు.. మండలి కార్యక్రమాలకు అంతరాయం కలిగించేలా… పోడియాన్ని చుట్టు ముట్టడం దుర్మార్గపు చర్య అని అభివ‌ర్ణించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments