పల్నాడు వీరుల చరిత్ర పోరాటానికి ప్రతీక
మంత్రి గొట్టిపాటి రవికుమార్ కామెంట్స్
అమరావతి – ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పల్నాడు వీరుల చరిత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన పల్నాటి వీరుల ఉత్సవాలలో పాల్గొన్నారు రవికుమార్.
యావత్ ప్రపంచంలో యుద్ద వీరులను పూజించే సంప్రదాయం గ్రీస్ తర్వాత పల్నాడు కారంపూడిలోనే ఉందన్నారు. నీతి, నిజాయితీ, ధర్మం పల్నాటి యుద్దమే ప్రతీక అని అన్నారు. పల్నాటి వీరుల చరిత్రను రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకునేలా చేస్తామని ప్రకటించారు గొట్టిపాటి రవికుమార్.
తాను పల్నాటి వీరుల ఉత్సవాలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కారంపూడి వీరుల దేవాలయంలో ఆరాధనోత్సవాల్లో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పల్నాడు ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని ఈ సందర్బంగా అన్నారు గొట్టిపాటి రవికుమార్.
ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాల నిర్వహణ అందరికీ ఆదర్శమన్నారు. రాష్ట్రమంతటా ప్రతి ఒక్కరికీ పల్నాడు వీరుల పరాక్రమం , ధైర్య సాహసాల గురించి తెలియ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.