కేటీఆర్ పై విచారణకు గవర్నర్ ఆమోదం
సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ ఫార్ములా కారు రేస్ స్కాంకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారని చెప్పారు. ఈనెల 28న భూమి లేని వారికి ర. 6 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సంక్రాంతి తర్వాత అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు సీఎం.
ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి రాష్ట్ర రాజకీయాలలో. ఇప్పటికే కేటీఆర్ తీవ్ర స్థాయిలో సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. అరెస్ట్ చేసినా, కేసులు నమోదు చేసినా బెదిరేది లేదంటూ స్పష్టం చేశారు. ఈ తరుణంలో తన అరెస్ట్ తప్పదని చెప్పకనే చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖలను నిర్వహించారు కేటీఆర్. ఆ సమయంలో ఫార్ములా రేస్ వన్ కారు పోటీలను చేపట్టారు. ఎవరి అనుమతి లేకుండా ముందస్తుగా రూ. 40 కోట్లకు పైగా చెల్లించినట్లు ఆరోపణలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై విచారణకు ఆదేశించారు సీఎం. ఏసీబీ ఈ మేరకు తనపై కేసు నమోదు , అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ ను కోరింది.