తుది జట్టులో శాంసన్ ఉండాల్సిందే
ప్రముఖ మాజీ క్రికెటర్..కామెంటేటర్ స్వాన్
న్యూఢిల్లీ – మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ గ్రేమ్ స్వాన్ సీరియస్ కామెంట్స్ చేశాడు. ఈసారి జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో కేరళ స్టార్ , రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కిప్పర్ సంజూ శాంసన్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యంత వేగవంతంగా 200 సిక్సర్లను కొట్టిన ఏకైక ఆట గాడిగా గుర్తింపు పొందాడు.
ఇదిలా ఉండగా ఢిల్లీ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో రాజస్థాన్ ఓటమి పాలైంది. కానీ నాయకుడిగా కష్టాలలో ఉన్న తన జట్టును కాపాడాడు. చివరి అంచుల దాకా చేర్చాడు. కానీ మూడో అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా తను సెంచరీ మిస్ అయ్యాడు.
ఒకానొక దశలో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సంజూ శాంసన్ మైదానంలోకి వచ్చాడు. 46 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 6 సిక్సర్లతో 86 రన్స్ చేశాడు. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యతగా ఉన్న గ్రేమ్ స్వాన్ ఆన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జూన్ లో జరగబోయే వరల్డ్ కప్ లో టీమిండియాలో తప్పనిసరిగా శాంసన్ ఉండాల్సిందేనని పేర్కొన్నాడు.