NEWSANDHRA PRADESH

పూల వ‌ర్షం బాబు ఆనందం

Share it with your family & friends

అపూర్వ స్పంద‌న అనూహ్య ఆద‌ర‌ణ

అమ‌రావ‌తి – ఏపీ సీఎంగా కొలువు తీరిన నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని రీతిలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని సంద‌ర్శించారు. తిరుమ‌ల కొండ‌పై ఇక నుంచి ఓం న‌మో వేంక‌టేశాయ అన్న నామం త‌ప్ప వేరేది వినిపించేందుకు వీలు లేద‌ని హెచ్చ‌రించారు. గ‌త స‌ర్కార్ తిరుమ‌ల‌ను భ్ర‌ష్టు ప‌ట్టించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అనంత‌రం కుటుంబ స‌మేతంగా విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. అక్క‌డి నుంచి నేరుగా ఇంద్ర‌కీలాద్రిపై కొలువు తీరిన శ్రీ క‌న‌క దుర్గ‌మ్మ అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌య పాల‌క మండ‌లి సాద‌ర స్వాగ‌తం ప‌లికింది. పూజారులు ఆశీర్వ‌చ‌నాలు అంద‌జేసి తీర్థ ప్ర‌సాదాలు ఇచ్చారు.

అక్క‌డి నుంచి స‌చివాల‌యానికి బ‌య‌లు దేరారు. భారీ ఎత్తున స్వాగ‌తం ల‌భించింది నారా చంద్ర‌బాబు నాయుడుకు. దారి పొడ‌వునా పూలు చ‌ల్లుతూ వెల్ క‌మ్ చెప్ప‌డంతో ఒకింత భావోద్వేగానికి లోన‌య్యారు ఏపీ సీఎం.