బాబుకు గ్రాండ్ వెల్ కమ్
ఏపీలో కూటమిదే హవా
అమరావతి – టీడీపీ జాతీయ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు. ఆయన దేశ వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశం కావడం విశేషం. ప్రస్తుతం ఎంతో ఉత్కంఠకు తెర తీశాయి ఏపీలో శాసన సభ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు. వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు వెళ్లిన ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు ఓటర్లు.
వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంటింటికీ చేర్చినా జనం ఆయనను నమ్మక పోవడం విస్తు పోయేలా చేసింది. తాము అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు తమను గట్టెక్కిస్తాయని నమ్ముతూ వచ్చారు జగన్ రెడ్డి. కానీ జనం ఛీ కొట్టారు.
175 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 158 సీట్లను కైవసం చేసుకునే దిశ వైపు ప్రయాణం చేస్తుండగా వైసీపీ కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ఇక కాబోయే ముఖ్యమంత్రి రేసులో నిలిచిన చంద్రబాబు నాయుడుకు ఏపీలో గ్రాండ్ వెల్ కమ్ చెప్పడం విశేషం. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబురాలలో మునిగి పోయాయి.