SPORTS

చెస్ ఛాంపియ‌న్ గుకేశ్ కు గ్రాండ్ వెల్ క‌మ్

Share it with your family & friends

ఎంకే స్టాలిన్ స‌ర్కార్ భారీ న‌జ‌రానా

త‌మిళ‌నాడు – పిన్న వ‌య‌సులోనే వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్ గా నిలిచిన గుకేష్ దొమ్మ‌రాజుకు సోమ‌వారం చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ స్పోర్ట్స్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ స్వాగ‌తం ప‌లికింది. సింగ‌పూర్ లో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో చైనాకు చెందిన డింగ్ లారెన్ ను ఓడించి చ‌రిత్ర సృష్టించాడు. గుకేశ్ కు ప్ర‌ధాని మోడీతో స‌హా ప్ర‌ముఖులు అభినందించారు. స్టాలిన్ స‌ర్కార్ ఏకంగా రూ. 5 కోట్లు రివార్డు ప్ర‌క‌టించింది.

గుకేశ్ స్వ‌స్థ‌లం ఏపీ. తండ్రి స‌ర్జ‌న్ కాగా త‌ల్లి కూడా ఉద్యోగే. చిన్న‌త‌నం నుంచే త‌ను చెస్ పై మ‌క్కువ పెంచుకున్నాడు. పేరెంట్స్ కూడా త‌న‌కు స‌హ‌కారం అందించారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో చెస్ ఛాంపియ‌న్ గా అవ‌త‌రించాడు.

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌మ తెలుగు వాడు రికార్డు సృష్టించ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు భ‌విష్య‌త్తులో త‌మ ప్ర‌భుత్వ ప‌రంగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రో వైపు మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యువ‌త రంగానికి గుకేశ్ దొమ్మ‌రాజు స్పూర్తిగా నిలుస్తార‌న‌డంలో సందేహం లేద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *