నిరుద్యోగులు సక్సెస్ దిగొచ్చిన సర్కార్
గ్రూప్ -2 పరీక్షలు డిసెంబర్ కు వాయిదా
హైదరాబాద్ – ఎట్టకేలకు నిరుద్యోగులు విజయం సాధించారు. తాము ఎక్కడా తగ్గలేదు. అనుకున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. అభ్యర్థులతో చర్చలు జరిపింది. ముందుగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లు టూరిజం ప్లాజాలో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా నిరుద్యోగులు కోరుతున్న డిమాండ్లు సరైనవేనంటూ పేర్కొన్నారు. వారికి మేలు చేకూర్చేలా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
దీనికి నిరుద్యోగులు ఒప్పుకున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చలు జరపాలని సూచించారు. ఈ మేరకు ప్రజా భవన్ లో నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఇందులో భాగంగా వినతిపత్రం సమర్పించారు.
ఒకేసారి డీఎస్సీతో పాటు గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించడం వల్ల తాము చదవలేక పోతున్నామంటూ వాపోయారు. తాము పరీక్షలను రద్దు చేయమని కోరడం లేదని, కేవలం కొంత గ్యాప్ మాత్రమే ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించారు డిప్యూటీ సీఎం. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.