SPORTS

శుభ్ మ‌న్ గిల్ సెన్సేష‌న్

Share it with your family & friends

షాన్ దార్ సెంచ‌రీతో షాక్

అహ్మ‌దాబాద్ – ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే గెల‌వాల్సిన లీగ్ మ్యాచ్ లో ఉన్న‌ట్టుండి బ‌ల‌మైన చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతులెత్తేసింది. ధోనీ మ్యాజిక్ ఏమీ ప‌ని చేయ‌లేదు గుజ‌రాత్ ముందు. ఆ జ‌ట్టు భారీ స్కోర్ చేసింది త‌న స్వంత మైదానంపై.

ప్ర‌ధానంగా ఇద్ద‌రు ఓపెన‌ర్లు శుభ్ మ‌న్ గిల్, చెన్నైకి చెందిన సాయి సుద‌ర్శ‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. ఇద్ద‌రూ అద్భుత‌మైన సెంచ‌రీల‌తో ఆక‌ట్టుకున్నారు. త‌మ జ‌ట్టుకు గౌర‌వ ప్ర‌ద‌మైన విజ‌యాన్ని అందించారు. అయినా ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు త‌ప్పుకుంది. కానీ లీగ్ లో లేక పోయినా పోరాటాన్ని మాత్రం ఆప‌లేదు.

ప్ర‌ధానంగా హార్దిక్ పాండ్యా త‌ప్పుకున్నాక కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు శుభ్ మ‌న్ గిల్. త‌ను సూప‌ర్ సెంచ‌రీ చేశాడు. సాయి తో క‌లిసి స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టించాడు. గిల్ 55 బంతులు ఎదుర్కొన్నాడు. 9 ఫోర్లు 6 సిక్స‌ర్లు కొట్టాడు. 104 ర‌న్స్ చేశాడు. సాయి సుద‌ర్శ‌న్ 51 బంతులు ఆడాడు. 5 ఫోర్లు 7 సిక్స‌ర్లు కొట్టాడు. 103 ర‌న్స్ చేశాడు. ఐపీఎల్ లో ఓపెన‌ర్లు రికార్డు భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఏకంగా ఒక‌టో వికెట్ కు 210 ర‌న్స్ చేశారు.