అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఇండియాదే
స్పష్టం చేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
ముంబై – భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ జట్టుతో స్వదేశంలో టెస్టు, వన్డే, టి20 సీరీస్ ఆడనున్న సందర్బంగా గంభీర్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఏకైక జట్టు టీమిండియా అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఎలాంటి బౌలింగ్ ఫార్మాట్ నైనా ఎదుర్కొనే సత్తా బ్యాటర్లకు ఉందని చెప్పాడు గౌతమ్ గంభీర్. ఇప్పటికే టీమిండియా వరల్డ్ కప్ కైవసం చేసుకుందని, ఇక బంగ్లాదేశ్ జట్టును తాము తక్కువ అంచనా వేయడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపాడు హెడ్ కోచ్.
ఎవరి ఒత్తిళ్లు ఇక్కడ పని చేయవని పేర్కొన్నాడు. ఆటగాళ్లు వారి వారి ప్రతిభ పాటవాలను పరిగణలోకి తీసుకునే ఎంపిక చేయడం జరుగుతుందని స్పష్టం చేశాడు గౌతం గంభీర్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి వాళ్లతో బలంగా ఉందన్నాడు.
ప్రపంచంలో ఎక్కడైనా ఏ ఫార్మాట్ లోనైనా ఆడే సత్తా కలిగి ఉంది భారత జట్టు అని స్పష్టం చేశారు గౌతం గంభీర్. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దుమ్ము రేపుతోందన్నాడు. పాత వారితో కొనసాగించడమా లేక కొత్త వారితో ప్రయోగం చేయడమా అన్నది ఆట ప్రారంభం కంటే ముందు నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.