గాడి తప్పిన కూటమి పాలన
యధేశ్చగా దర్జాగా దోపిడీ
విశాఖపట్నం – ఏపీ వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వ పాలన గాడి తప్పిందని ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి.
ఎన్నికల ఫలితాలు వచ్చి 44 రోజుల లోపే తమ నిజ స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు గుడివాడ అమర్ నాథ్. విశాఖ లోని భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందినంత మేర దండు కోవడంపైనే ఫోకస్ పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇలా చెప్పకనే చెపుతున్నారంటూ ధ్వజమెత్తారు.
నిన్నటి దాకా ప్రగల్భాలు పలికిన, ప్రజా పాలన చేస్తున్నామంటూ గొప్పలు చెబుతూ వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెబుతారంటూ ప్రశ్నించారు గుడివాడ అమర్ నాథ్.