నిప్పులు చెరిగిన గుడివాడ అమర్ నాథ్
విశాఖపట్నం – మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై అవాకులు చెవాకులు పేలిన హొం మంత్రి వంగలపూడి అనితపై భగ్గుమన్నారు. తనపై చేసిన కామెంట్స్ కు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఆమెకు అంత సీన్ లేదన్నారు.
తను రీల్స్ చూసుకొని కాలక్షేపం చేస్తే మంచిదని హితవు పలికారు. కూటమి సర్కార్ కొత్త ఉద్యోగాలు ఇవ్వడం మాటేమో కానీ ఉన్న వారిని తీసేయడం పనిగా పెట్టుకుందన్నారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ఏకగా 4 లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిందన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్, మంత్రి టీజీ భరత్ లు ప్రభుత్వ ఖర్చుతో దావోస్ పర్యటనకు వెళ్లారని ఏపీకి ఏం తీసుకు వచ్చారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము చేసుకున్న ఒప్పందాలనే తిరిగి చేసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు గుడివాడ అమర్నాథ్.
కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే భారత దేశపు బడ్జెట్ కూడా చాలదంటూ ఎద్దేవా చేశారు. సొల్లు కబుర్లు తప్పా చేసింది ఏమీల ఏదన్నారు. అభివృద్ది పేరుతో బాబు డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు.