ఏపీ సీఎం లడ్డూపై దుష్ప్రచారం – గుడివాడ
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అమర్నాథ్
విశాఖపట్నం – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కావాలని తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందంటూ చిల్లర రాజకీయం చేస్తున్నాడంటూ ఆరోపించారు.
సూపర్ సిక్స్ అంటూ ఆచరణకు నోచుకోని హామీలను గుప్పించాడని, తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశాడని ధ్వజమెత్తారు. హామీలను అమలు చేయలేక ప్రజల్లో చులకన అవుతున్నాడని, దీనిని డైవర్ట్ చేసేందుకు తాజాగా తెర మీదకు తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందంటూ కొత్త రాగం ఎత్తుకున్నాడని ఆరోపించారు గుడివాడ అమర్నాథ్.
టీటీడీలో కట్టుదిట్టమైన వ్యవస్థ ఉంటుందని, ఒకటికి మూడుసార్లు నెయ్యిని చెక్ చేస్తారని, బాగా లేదని తేలితో వెంటనే వెనక్కి పంపిస్తారని అన్నారు. ఆ మాత్రం తెలుసు కోకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమన్నారు మాజీ మంత్రి.
తమను బద్నాం చేసేందుకు పూనుకున్న చంద్రబాబు సిట్ వేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ చీఫ్ , మాజీ సీఎం జగన్ రెడ్డి ఏకంగా పీఎంకు, సీజేఐకి లేఖలు రాశారని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని కోరారని తెలిపారు. ఎందుకు చంద్రబాబు సిట్ వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు గుడివాడ అమర్నాథ్.