NEWSANDHRA PRADESH

లోకేష్ కు రిట‌ర్న్ గిఫ్ట్ రెడీ

Share it with your family & friends

ఐటీ శాఖ మంత్రి అమ‌ర్ నాథ్

అమ‌రావ‌తి – ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్ నిప్పులు చెరిగారు. లోకేశ్ పై మండిప‌డ్డారు. నీకు రిట‌ర్న్ గిఫ్టు రెడీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. జ‌గ‌న్ ను విమ‌ర్శించే స‌త్తా నీకు లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. తండ్రీ కొడుకుల‌కు అంత సీన్ లేద‌న్నారు. ఉత్త‌రాంధ్ర‌ ప్రాంత అభివృద్ధిపై చర్చకొచ్చే దమ్మూ ధైర్యం మీకుందా అని ప్ర‌శ్నించారు.

విస్సన్నపేట భూముల్లో నాకు సెంటు భూమి ఉన్న‌ట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని స‌వాల్ చేశారు గుడివాడ అమ‌ర్ నాథ్. గ‌తంలో ఇవే ఆరోపణలు చేసిన దత్తపుత్రుడు పవన్ కల్యాణే ఏమీ పీకలేక పోయాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఐటీ శాఖ మంత్రిగా 250 కంపెనీల‌ను తాను విశాఖ‌కు తీసుకు వ‌చ్చాన‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం ఐటీ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇన్ఫోసిస్ , అదానీ డేటా సెంట‌ర్ల‌ను తీసుకు వ‌చ్చామ‌న్నారు.

అంతే కాకుండా మూలపేట పోర్టు, భోగాపురం ఏయిర్‌పోర్టును నిర్మిస్తున్నామ‌ని అన్నారు. గ‌తంలో ఐటీ మంత్రిగా నువ్వూ.. ముఖ్యమంత్రిగా నీ తండ్రి ఏం వెలగబెట్టారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు గుడివాడ అమ‌ర్ నాథ్.