38 పరుగుల భారీ తేడాతో ఘన విజయం
అహ్మదాబాద్ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. 38 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. టోర్నీ ఆరంభంలో దుమ్ము రేపిన ఎస్ఆర్ హెచ్ ఆ తర్వాత నిరాశ పరిచింది. ప్రసిద్ద కృష్ణ, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో హైదరాబాద్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే.
టోర్నీలో ఇప్పటి వరకు సన్ రైజర్స్ 10 మ్యాచ్ లు ఆడగా వాటిలో 7 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ నికర రన్ రేట్ ఆధారంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును దాటి 14 పాయింట్లతో 2వ స్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటమ్స్ తరఫున శుభ్ మన్ గిల్ , జోస్ బట్లర్ అర్ధ సెంచరీలతో మోత మోగించారు. హైదరాబాద్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించారు. 225 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి కేవలం 186 రన్స్ మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అద్భుతంగా రాణించినా జట్టు గెలవలేక పోయింది.