జాతీయ ఉత్తమ చిత్రం గుల్మోహర్
ప్రకటించిన కేంద్ర సమాచార శాఖ
న్యూఢిల్లీ – జాతీయ ఉత్తమ చిత్రంగా మనోజ్ వాజ్ పేయి, షర్మిలా ఠాగోర్ కలిసి నటించిన గుల్మోహర్ ఎంపికైంది. శుక్రవారం జాతీయ స్థాయి అవార్డులను కేంద్ర సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడిగా కర్ణాటక సినీ రంగానికి చెందిన కాంతారా మూవీలో నటించిన రిషబ్ శెట్టిని ఎంపిక చేసింది. నిత్యా మీనన్ ను ఉత్తమ నటిగా ప్రకటించింది.
ఇక హిందీలో గత 2023 సంవత్సరంలో రిలీజ్ అయిన గుల్మోహర్ ను అత్యుత్తమ సినిమా కేటగిరీలో ఎంపిక చేయడం జరిగిందని వెల్లడించింది. రాహుల్ వి. చెట్టెళ్ల దర్శకత్వం వహించారు ఈ మూవీకి. అర్పితా ముఖర్జీ, వికేష్ భూటానీ నిర్మించారు.
ఈ చిత్రంలో రాహుల్ చిట్టెల, సుజాత్ సౌదాగర్ , షర్మిలా ఠాగూర్, మనోజ్ వాజ్ పేయి, సిమ్రాన్ , సూరజ్ శర్మ, అమోల్ పాలేకర్ , కావేరీ సేఠ్ నటించారు. ఈషిత్ నరేన్ సినిమాటోగ్రఫీ అందించగా తనుప్రియ శర్మ ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రానికి సిద్దార్థ ఖోస్లా సంగీతం అందించారు.