గుంటూరు పోలీసులు బిగ్ షాక్
అమరావతి – వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు జె. మాణిక్యాల రావు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా కామెంట్స్ చేశారంటూ తెలిపారు. తక్షణమే ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారు. ఆయనపై 17 కేసులు నమోదు చేశారు. వీటిని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇంకో వైపు దర్శకుడు ఆర్జీవీకి గుంటూరు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
దీనిపై సీరియస్ గా స్పందించారు రామ్ గోపాల్ వర్మ. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరో వైపు రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో వైసీపీ నేతలపై కేసుల నమోదు పరంపర కొనసాగుతోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. పోసానిని ప్రతి రోజూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మరో వైపు శాసన మండలి వేదికగా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆడుదాం ఆంధ్రాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణకు ఆదేశించామన్నారు. దీంతో మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణికి షాక్ ఇచ్చారు.