యాంకర్స్ చిత్రా త్రిపాఠి..సయ్యద్ సుహైల్ కు కోర్టు షాక్
అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన గురుగ్రామ్ న్యాయస్థానం
ఢిల్లీ – గురుగ్రామ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పోక్సో కేసులో ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్లు చిత్రా త్రిపాఠి, సయ్యద్ సుహైల్ లకు బిగ్ షాక్ ఇచ్చింది ధర్మాసనం. అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. 2013లో పోక్సో కేసు నమోదైంది ఈ యాంకర్లపై.
చిత్రా త్రిపాఠి ప్రస్తుతం ఏబీపీ న్యూస్ లో పని చేస్తుండగా , సయ్యద్ సుహైల్ రిపబ్లిక్ భారత్ టీవీ ఛానల్ లో ఉన్నారు. ఈ ఇద్దరికీ ప్రత్యేక కోర్టు ఈనెల ప్రారంభంలో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
బెయిల్ ను రద్దు చేయాలని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆ ఇద్దరు జర్నలిస్టులు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది గురుగ్రామ్ కోర్టు. ఈనెల 30 లోపు అరెస్ట్ చేయాలని ఆదేశించింది.
పది సంవత్సరాల బాలిక , ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన మార్ఫింగ్, ఎడిటింగ్ చేసిన వీడియోలను ప్రసారం చేశారనే ఆరోపణలపై యాంకర్లు దీపక్ చౌరాసియా, చిత్రా త్రిపాఠి, అజిత్ అంజుమ్ తో సహా 8 మంది జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయి.
వీరిపై 120బి, 471, 469 , 67బి, 67, ఐటీ, పోక్సో చట్టంలోని 23 , 13సీ సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపారు. దీనికి సంబంధించి ఇవాళ కోర్టు తీర్పు వెలువరించింది.