మండలి చైర్మన్ షాకింగ్ కామెంట్స్
రేషన్ బియ్యం అక్రమ రవాణా
హైదరాబాద్ – తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం శాసన మండలిలో ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేషన్ బియ్యం అక్రమంగా తరలి పోతున్నట్లు తనకు అనుమానం కలుగుతోందని అన్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి స్పందించాలని పేర్కొన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలి పోతున్నట్లు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. దానిపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని రేషన్ దుకాణాలలో లబ్దిదారులకు అందజేస్తున్న బియ్యం నాణ్యతగా ఉండడం లేదని వాడడం లేదన్నారు. కొందరు మాత్రమే తీసుకు వెళుతున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా తాజాగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఈ మేరకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇక ఆయా రేషన్ డీలర్ల భర్తీకి సంబంధించి జిల్లాల కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.