ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా
ప్రకటించిన నటి హంసా నందిని
హైదరాబాద్ – ప్రముఖ టాలీవుడ్ నటి హంసా నందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తను స్పందించారు. ఎవరూ ఊహించని రీతిలో తను క్యాన్సర్ బారిన పడ్డారు. రొమ్ము క్యాన్సర్ కు గురయ్యారు. జీవితంలో అన్నింటిని భరించేందుకు తాను సిద్దపడే వచ్చానని, ఈ రోగం వచ్చిందని బాధ పడాల్సిన అవసరం లేదని సూచించారు. తన లాంటి వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారని తెలిపారు.
కావాల్సిందల్లా ధైర్యంగా ఉండడం తప్పితే ఏమీ చేయలేమని పేర్కొంది. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ కు గురైంది. ఈ విషయం తెలిసి తొలుత బాధ పడింది. కన్నీళ్లు పెట్టుకుంది. అత్యంత ఖరీదైన వైద్యం చేయించుకుంది. చివరకు ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
ఈ లోకాన్ని కిటికీ నుంచి చూడటం చాలా ఆనందం కలిగిస్తోందని పేర్కొంది నటి హంసా నందిని. జీవితమనే కాల ప్రవాహంలో ఇలాంటివి అరుదుగా వస్తుంటాయని, కానీ తప్పదు వాటిని ఎదుర్కోవడమో లేక లొంగి పోవడమో చేయాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేసింది.
విచిత్రం ఏమిటంటే తన తల్లి 40 ఏళ్ల వయసులో ఉండగా రొమ్ము క్యాన్సర్ కు గురై తనువు చాలించిందని , కానీ ఇప్పుడు అదే తనను కబళించేందుకు రావడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు.