హనుమాన్ బేనివాల్ షాకింగ్ కామెంట్స్
ఇండియా కూటమి పక్కన పెట్టిందని ఫైర్
న్యూఢిల్లీ – ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ బేనివాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రతిపక్షాలపై భగ్గుమన్నారు. తనను కావాలని పక్కన పెట్టారంటూ ధ్వజమెత్తారు. హనుమాన్ బేనివాల్ గత కంత కాలంగా ప్రజల పక్షం వహిస్తూ వచ్చారు. పార్లమెంట్ లో ప్రజల తరపున గొంతు వినిపించారు.
అంతే కాదు రైతుల ఆందోళన చేపట్టిన సమయంలో అన్నదాతలకు అండగా నిలిచారు హనుమాన్ బేనివాల్. ఆయన ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు. చిన్న పార్టీకి నాయకత్వం వహిస్తున్న తనను భారత కూటమి అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కావాలని తనను పక్కన పెట్టారంటూ పేర్కొన్నారు హనుమాన్ బేనివాల్. ఇదిలా ఉండగా తను రాజస్థాన్ లో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓటమి నుంచి కాపాడే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.