SPORTS

హ్యాపీ బ‌ర్త్ డే గౌతమ్ గంభీర్

Share it with your family & friends

భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్

హైద‌రాబాద్ – టీమిండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ పుట్టిన రోజు ఇవాళ‌. అక్టోబ‌ర్ 14న ఢిల్లీలో పుట్టాడు. ఆయ‌న వ‌య‌సు 43 ఏళ్లు. క్రికెట‌ర్ గా, రాజ‌కీయ నాయ‌కుడిగా , ప్ర‌స్తుతం మెంటార్ గా, శిక్ష‌కుడిగా ఉన్నాడు. తాను సంపాదించిన దాంట్లోంచి దాన ధ‌ర్మాలు చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ఢిల్లీ విశ్వ విద్యాల‌యంలో చ‌దువుకున్నాడు. ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం పొందాడు. గౌత‌మ్ గంభీర్ మారు పేరు గౌతీ.

భార‌త క్రికెట్ జ‌ట్టు సాధించిన విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించాడు. తొలి టెస్టు ఆస్ట్రేలియాతో ఆడాడు. చివ‌రి టెస్టు ఇంగ్లండ్ తో ముగించాడు. తొలి టి20 స్కాట్లాండ్ తో ఆడ‌గా చివ‌రి టి20 మ్యాచ్ పాకిస్తాన్ తో ముగించాడు గౌత‌మ్ గంభీర్.

ఐపీఎల్ ప‌రంగా ఢిల్లీ, ఢిల్లీ డేర్ డెవిల్స్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ . గ‌త ఏడాది కేకేఆర్ కు మెంటార్ గా ఉన్నాడు. ప‌దోన్న‌తిపై భార‌త జ‌ట్టు కు కోచ్ గా ఎంపిక‌య్యాడు గౌతీ. త‌న క్రికెట్ కెరీర్ లో 58 టెస్టులు ఆడాడు. 4,154 రన్స్ చేశాడు. 147 వ‌న్డేలు ఆడాడు 5,238 ప‌రుగులు చేశాడు. 37 టి20 మ్యాచ్ లు ఆడి 932 ర‌న్స్ కొట్టాడు.

2007, 2011 ప్ర‌పంచ క‌ప్ లు గెలుచుకున్న భార‌త జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు గౌతమ్ గంభీర్. ఐపీఎల్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు స్కిప్ప‌ర్ గా 2012, 2014 ల‌లో ఛాంపియ‌న్ గా నిలిచేలా చేశాడు. బీజేపీ నుంచి ఎంపీగా గెలుపొందాడు. ఆ త‌ర్వాత మిన్న‌కుండి పోయాడు. కోచ్ గా రాణిస్తున్నాడు.