ENTERTAINMENT

హ్యాపీ బ‌ర్త్ డే డార్లింగ్ ప్ర‌భాస్

Share it with your family & friends

వెల్లువెత్తుతున్న శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ – తెలుగు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌భాస్ పుట్టిన రోజు ఇవాళ‌. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. ప్ర‌ధానంగా త‌ను రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సినిమాలు ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యాయి. అందులో ఛ‌త్ర‌ప‌తి కాగా మ‌రొక‌టి బాహుబ‌లి. ఈ రెండు సినిమాలు ప్ర‌భాస్ కెరీర్ లో ఉత్త‌మ స్థానానికి తీసుకు వెళ్లేలా చేశాయి. ఇవాళ టాప్ ఇండియన్ స్టార్ గా పేరు పొందాడు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌భాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్య నారాయణ ప్రభాస్ రాజు . అక్టోబ‌ర్ 23, 1979లో పుట్టాడు . భార‌త దేశ సినీ చ‌రిత్ర‌లో ఎక్కువ పారితోష‌కం తీసుకునే న‌టుడు కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ఇందులో ల‌వ‌ర్ గా న‌టిస్తుండ‌డం తో మ‌రింత ఆస‌క్తి రేపుతోంది. సినిమా పేరు కూడా ఖ‌రారు చేశాడు ద‌ర్శ‌కుడు. అదే రాజా సాబ్.

2015 నుండి నేటి దాకా పోర్బ్స్ ఇండియా సెల‌బ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదిస్తూ వ‌స్తున్నాడు. మీడియాలో రెబ‌ల్ స్టార్ అనే పేరు పొందాడు. ఇప్ప‌టి దాకా 20కి పైగా సినిమాల‌లో న‌టించాడు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌తో పాటు నంది, సైమా అవార్డులు ద‌క్కాయి త‌న‌కు. 2002లో ఈశ్వ‌ర్ సినిమాతో ప్ర‌భాస్ తెరంగేట్రం చేశాడు. 2004లో వ‌ర్షం, 2005లో ఛ‌త్ర‌ప‌తి, 2008లో బుజ్జిగాడు, 2009లో భిల్లా, 2010లో డార్లింగ్ , 2011లో మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ , 2013లో మిర్చి చిత్రాల‌లో న‌టించాడు. 2015లో బాహుబ‌లి, 2017లో బాహుబ‌లి -2 చిత్రం చేశాడు. 2023లో స‌లార్ , 2024లో క‌ల్కి సినిమాల‌లో న‌టించాడు . రికార్డ్ బ్రేక్ చేశాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల‌కు పైగా ఓపెనింగ్స్ తో ఆరు చిత్రాలు క‌లిగి ఉన్న ఏకైక భార‌తీయ న‌టుడు ప్ర‌భాస్ కావ‌డం విశేషం.