ఆసీస్ తో సీరీస్ గంభీర్ కు పరీక్ష
కీలక కామెంట్స్ చేసిన హర్భజన్
ఢిల్లీ – మాజీ క్రికెటర్ , ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో భారత్ ఆడే సీరీస్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు అగ్ని పరీక్ష కానుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం బీసీసీఐ కూడా తీవ్ర అసహనంతో ఉంది. గంభీర్ కోచ్ గా ఎంపికయ్యాక భారత్ లో జరిగిన న్యూజిలాండ్ సీరీస్ 3-0 తో ఘోరమైన ఓటమి పాలైంది.
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీసీసీఐ భారతీయ జనతా పార్టీకి కేరాఫ్ గా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర మంత్రి షా కొడుకే కార్యదర్శిగా ఉన్నారు. ఆయన చేతుల్లోనే సంస్థ నడుస్తోంది.
ఇదే సమయంలో బీజేపీ ఎంపీగా గతంలో పని చేశారు గౌతమ్ గంభీర్. ఐపీఎల్ లో కేకేఆర్ మెంటార్ గా పని చేశాడు. ఊహించని రీతిలో అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించి ఐపీఎల్ కప్ ను చేజిక్కించుకుంది. దీంతో ఏరికోరి గంభీర్ పెట్టిన కండీషన్స్ కు ఒప్పుకుంది బీసీసీఐ. కానీ ఆశించిన మేర ఫలితాలు రాక పోవడంతో తీవ్ర ఒత్తిడి నెలకొంది.
ఇదే సమయంలో గంభీర్ కాకుండా వీవీఎస్ లక్ష్మణ్ ను సౌతాఫ్రికా టూర్ కు పంపించింది బీసీసీఐ. 3-1 టి20 సీరీస్ చేజిక్కించుకుంది సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు. దీంతో గంభీర్ పై ఎక్కువగా ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇదిలా ఉండగా భజ్జీ చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.