ఓటు కీలకం ప్రజాస్వామ్యానికి మూలం
ఓటు వేయాలని కలెక్టర్ పిలుపు
నల్లగొండ జిల్లా – నేను ఓటు వేశాను. మరి మీరు ఓటు వేయకుండా ఉంటే ఎలా అని ప్రశ్నించారు నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన. ఆమె రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారారు. గత కొన్నేళ్లుగా ఎక్కడికి వెళ్లినా ఓటు ప్రాధాన్యత గురించి చెబుతూ వస్తుననారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం నల్లగొండ జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మే 13న సోమవారం పోలింగ్ కావడంతో తనే ముందుండి ఓటు వేశారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఓటు వేసిన విషయాన్ని పంచుకున్నారు.
ఓటు మనందరి బాధ్యత. ఇది ఎవరి కోసమో కాదు. మన దేశం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం దాకా కేంద్ర ఎన్నికల సంఘం ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చిందని మీరంతా ఇళ్లలోంచి బయటకు రావాలని కోరారు.
ఎవరు ఓటు వేయక పోయినా అది నేరమే అవుతుందని పేర్కొన్నారు. ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా గుర్తించి , ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవడం, రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవడమేనని పేర్కొన్నారు.