NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ పోరాటం ఎవ‌రి కోసం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన హ‌రిరామ జోగయ్య

అమ‌రావ‌తి – ప్ర‌ముఖ సీనియ‌ర్ నాయ‌కుడు , కాపు నాయ‌కుడు హ‌రి రామ జోగ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. జోగ‌య్య సుదీర్ఘ లేఖ రాశారు. ఈసారి మ‌రింత ఘాటుగా రాయ‌డం విశేషం.

వైసీపీని ఏపీలో ఓడించాలంటే చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొన్నారు. కాపులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెంట నడుస్తున్న‌ది చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రి చేయ‌డం కాద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

రెండున్న‌ర ఏళ్ల పాటు సీఎంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. లేక పోతే ఏపీలో కాపు సామాజిక వ‌ర్గం ఒప్పుకోద‌ని హెచ్చ‌రించారు హ‌రి రామ జోగ‌య్య‌. ప‌వ‌న్ సీఎం అభ్య‌ర్థిత్వంపై చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేయాల‌ని డిమాండ్ చేశారు. జ‌న‌సేన టీడీపీకి టికెట్లు కేటాయించ‌డం కాదు జ‌న‌సేనే తెలుగుదేశం పార్టీకి సీట్లు కేటాయించే స్థాయికి చేరుకోవాల‌న్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రి కోసం ప‌ని చేస్తున్నాడో ముందు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని మండిప‌డ్డారు హరి రామ జోగ‌య్య‌.